నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం సోమవారం రాత్రి 8 గంటలకు దేపూరు గ్రామానికి చెందిన సువార్తమ్మ (22) ఆసుపత్రిలో చేరారు. మహిళకు అదే రాత్రి 10 గంటలకు నర్సులు డెలివరీ చేశారని మహిళ చెబుతోంది. ఆ సమయంలో తన బంధువులను ఎవరినీ అనుమతించలేదని.. డెలివరీ అయిన కాసేపటికి బిడ్డ చనిపోయినట్లు తెలిపారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ సమయంలో వైద్యులు ఎవరూ లేరని.. డాక్టర్ పర్యవేక్షణ లేకనే తన బిడ్డ చనిపోయిందని ఆరోపించింది. తన బిడ్డ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టింది. నువార్తమ్మ భర్త ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆసుపత్రికి వచ్చి విచారణ చేపట్టారు.
ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు అందడం లేదని బాధితుల ఆందోళన - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
తన బిడ్డ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఎదుట బైఠాయించింది ఓ బాధితురాలు. కడుపులో బిడ్డ చినిపోయిందని చెప్పిన వైద్యులు.. నిర్థరణ కోసం పరీక్షలు చేయాలని చెప్పి ఇంతవరకూ చేయలేదని మరో ఆస్పత్రికి వెళ్లిపోయింది ఇంకో బాధితురాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు సరిగా అందడంలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే ఆస్పత్రిలో ఉదయగిరికి చెందిన ఉషా అనే మహిళ తన కడుపులో బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారని అన్నారు. నిర్ధరణ కొరకు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చినా.. ఇంతవరకు వైద్యులు తనను ఎటువంటి పరీక్షలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో వైద్యం కోసం ఆమె మరో ఆసుపత్రికి వెళ్లిపోయారు. గతంలో మంచి సేవలను అందించిన ఆత్మకూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి.. నేడు అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 31,118 మందికి కరోనా