నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలోని మద్యం దుకాణంలో అమ్మకాలను నిషేధించాలని.. మహిళలు నిరసనకు దిగారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున.. మద్యం కొనుగోలుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి వల్ల తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళనతో.. మహిళలు దుకాణం వద్ద ఆందోళన చేశారు. మద్యం దుకాణాలు తెరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. అమ్మకాలను ఆపేస్తామనటంతో మహిళలు.. ఆందోళన విరమించారు.
మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ మహిళల ఆందోళన - నెల్లూరు జిల్లాలో మహిళల నిరసన
నెల్లూరు జిల్లాలోని జయంపు గ్రామంలో మద్యం దుకాణాల ముందు మహిళలు ఆందోళన చేశారు. మండలంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ మహిళల ఆందోళన