ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రేషన్ సరుకులు రావడం లేదు.. ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు' - ఉదయగిరి తాజా వార్తలు

నిరుపేదలైన తమకు రేషన్ సరుకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఉదయగిరి పట్టణంలోని దేవలాల గడ్డ, తుఫాన్ నగర్ వీధులకు చెందిన మహిళలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తహసీల్దార్ హరనాథ్​ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు.

women protest at udayagiri tahsil office
ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన

By

Published : Mar 23, 2021, 5:37 PM IST

రేషన్ సరుకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని నెల్లూరు జిల్లా ఉదయగిరి తహసీల్దార్​ కార్యాలయం వద్ద మహిళలు నిరసన తెలియజేశారు. పట్టణంలోని దేవలాల గడ్డ, తుఫాన్ నగర్ వీధుల్లో 200 మంది వరకు రేషన్​ కార్డుదారులు ఉన్నారు. కేవలం ఒక్కరోజే నిత్యావసర సరుకుల పంపిణీ వాహనం ఇంటికి వచ్చి వెళ్తోందని.. నామమాత్రంగా కార్డుదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహించారు. ఆ తర్వాత అటు వైపే రావడం లేదని మహిళలు మండిపడ్డారు. కార్డుదారులకు కందిపప్పు ఇవ్వడం లేదని.. ఎందుకని ప్రశ్నిస్తే ఆపరేటర్ తిరిగి తమనే బెదిరిస్తున్నాడని వాపోయారు.

కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమకు రేషన్ సరుకులు అందని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. సమస్యను స్థానిక వాలంటీర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకుండా పోయిందని.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మొబైల్ వాహన ఆపరేటర్​పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ హరనాథ్​కు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన తహసీల్దార్.. వీఆర్వోతో పాటు డీలర్​ను పిలిపించి మాట్లాడారు. కార్డుదారులకు సరుకులు అందేలా చూడాలని ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details