నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆస్పత్రిలో ప్రసవమైన మహిళకు కరోనా నిర్ధరణ అయ్యింది. శనివారం కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.... నొప్పులు రావడంతో శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. ఆ తర్వాత మహిళకు కరోనా నిర్ధరణ కావడంతో తల్లీబిడ్డల సంరక్షణకు చర్యలు చేపట్టారు. వారిని నెల్లూరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
బాలింతకు కరోనా.. క్వారంటైన్‌కు వైద్యులు
క్వారంటైన్లో ఉన్న గర్భిణీకి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ఫలితాలు వచ్చేలోపే ఆమెకు శస్త్రచికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. ఆ తరువాత ఫలితాలు చూస్తే పాజిజివ్ వచ్చింది. ఈ మేరకు అందర్నీ హోం క్వారంటైన్‌కు తరలించారు.
ఆత్మకూరు ఆస్పత్రిలో ప్రసవమైన మహిళకు కరోనా నిర్ధరణ
ఈనెల 6న పెరమనలో బంధువుల అంత్యక్రియలకు గర్భిణీ వచ్చింది. 9న గర్భిణీ, బంధువులను... అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. నొప్పులు రావడంతో ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రసవానికి ముందే వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ప్రసవం తర్వాత కరోనా తేలడంతో వైద్య సిబ్బందిని హోమ్ క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చదవండి:ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షలకు చేరువలో కరోనా కేసులు
Last Updated : Jun 14, 2020, 12:21 PM IST