ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దిశ.. దిక్కులేని చట్టంగా మారింది' - Marripadu updates

నెల్లూరు జిల్లా మర్రిపాడులో మహిళా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. మూడు రోజుల క్రితం దారుణహత్యకు గురైన బుజ్జమ్మ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళలకు రక్షణగా సీఎం జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం దిక్కులేని చట్టంగా మారిందన్నారు.

women groups
మహిళా సంఘాల నేతల

By

Published : Sep 3, 2021, 3:46 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడులోని బస్టాండ్ సెంటర్​లో మహిళా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. మూడు రోజుల క్రితం కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో గ్రామానికి చెందిన బుజ్జమ్మను దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్​లో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని ఆరోపించారు. సీఎం జగన్​ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశ చట్టం దిక్కులేని చట్టంగా మారిందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details