ETV Bharat / state
మతిస్థిమితం లేని యువతి హత్యాచారం - నెల్లూరులో మహిళ అత్యాచారం హత్య
నెల్లూరు జిల్లా గూడూరులో మతిస్థిమితం లేని యువతిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన యువతి తన తమ్ముడితో కలిసి ఉంటోంది. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె బయటకు వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రావకపోవటంతో కుటుంబసభ్యులు గాలించారు. చవటపాలెంలోని ఓ ఇంట్లో చనిపోయి వివస్త్రగా పడి ఉంది. అత్యాచారం చేసి హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
![మతిస్థిమితం లేని యువతి హత్యాచారం women gang raped and died in nellore dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5613690-760-5613690-1578307348762.jpg)
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
By
Published : Jan 6, 2020, 4:56 PM IST
| Updated : Jan 6, 2020, 7:53 PM IST
మతిస్థిమితం లేని యువతి హత్యాచారం ఇదీ చూడండి:
Last Updated : Jan 6, 2020, 7:53 PM IST