ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన.. నిలిచిన వాహనాలు - నెల్లూరు జిల్లా సంగం మండల

BC COLONY PEOPLES PROTEST : కాలనీలో మంచినీటి సమస్యను తీర్చాలంటూ మహిళలు ఖాళీ బిందెలు చేతబట్టి నినాదాలు చేశారు. గ్రామస్థుల నిరసనలతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

BC COLONY PEOPLES PROTEST
BC COLONY PEOPLES PROTEST

By

Published : Sep 21, 2022, 5:38 PM IST

PROTEST FOR WATER: నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని తిరమనతిప్ప బీసీ కాలనీ వాసులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. తమ కాలనీలో మంచినీటి సమస్యను తీర్చాలంటూ ఖాళీ బిందెలతో రహదారిపై మహిళలు ఆందోళనకు దిగారు. మంచినీళ్లు కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. స్థానిక వైకాపా నాయకులు కాకు మధు, ఎస్సై నాగార్జునరెడ్డిలు కాలనీ వాసులతో మాట్లాడి సమస్య తెలుసుకుని పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details