ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళ అరెస్ట్.. రూ.ఆరు లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

ఆర్టీసీ బస్సులో నగల చోరీ కేసును నెల్లూరు జిల్లా పోలీసులు ఛేధించారు. ఓ మహిళను అరెస్ట్ చేసి.. ఆమె వద్ద నుంచి 117 గ్రాముల బంగారు ఆభరణాలు, 210 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.ఆరు లక్షల దాకా ఉంటుందన్నారు.

woman thief arrested in nellore district
మహిళ అరెస్ట్... రూ.ఆరు లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

By

Published : Mar 14, 2021, 10:20 PM IST

ఆర్టీసీ బస్సులో నగల బ్యాగు చోరీ కేసును నెల్లూరు చిన్నబజార్ పోలీసులు ఛేదించారు. ఓ మహిళ దొంగను అరెస్ట్ చేసి.. 117 గ్రాముల బంగారు ఆభరణాలు, 210 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

జనవరి 25వ తేదీన కడప జిల్లా చెన్నూరు మండలానికి చెందిన పన్యం లవంగి అనే మహిళ నెల్లూరు నుంచి ఆర్టీసీ బస్సులో బద్వేల్​కు బయలుదేరింది. బద్వేల్​కు వెళ్లిన తర్వాత నగల బ్యాగు చోరీకి గురైందని తెలుసుకుని, అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును చిన్నబజార్ స్టేషన్​కు బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వసంతమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.ఆరు లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకొన్నారు. చోరీ కేసు ఛేదించిన చిన్నబజార్ పోలీసులను డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి అభినందించారు.

ఇదీ చదవండి

అలిపిరిలో అదృశ్యమైన బాలుడిని తిరుపతి పోలీసులకు అప్పగింత

ABOUT THE AUTHOR

...view details