WOMAN SUICIDE ATEEMPT : వైసీపీ కార్పొరేటర్ తమ ఇంటిని పడగొట్టి, వేరొకరికి విక్రయించారని ఆరోపిస్తూ.. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మస్తానమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. నెల్లూరు జిల్లా చాణిక్యపురి కాలనీలో నివాసముంటున్న మస్తానమ్మ.. ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటిని పడగొట్టిన 29వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ సత్తార్.. దానిని ఆక్రమించి మరొకరికి విక్రయించారని మహిళ ఆరోపించారు. సెప్టెంబర్ 9న గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత తాడేపల్లి ప్రజాదర్భార్‌కు వెళ్లి వినతిపత్రం ఇచ్చినా న్యాయం జరగలేదని వాపోయారు.
"వైసీపీ నాయకుడు ఇంటిని ఆక్రమించాడు.. నాకు న్యాయం చేయండి" - మహిళ ఆత్మహత్యాయత్నం
WOMAN SUICIDE ATEEMPT: ఓ మహిళ కూలీ పనుల కోసం వేరే ఊరెళ్లింది.. అదే అదనుగా ఓ వైసీపీ కార్పొరేటర్ ఆమె ఇంటిని ఆక్రమించి.. వేరే వారికి అమ్మేశాడు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన ఆమె.. కూలగొట్టిన తన ఇంటిని చూసి ఆవేదన చెందింది. ఎక్కడికి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా.. ఆమె సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. దీంతో ఆవేదన చెందిన సదరు మహిళ.. నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.
woman suicide attempt
నేడు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం జరిగేవరకు నిరసన కొనసాగిస్తానని మహిళ తెలిపారు. వైసీపీ కార్పొరేటర్‌ను అరెస్టు చేసి,.. తమ స్థలం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: