ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పేర్నమెట్టలో నివాసముంటున్న శాంతకుమారి.. ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు మూగజీవులను పెంచుకోవడం అలవాటు. ఇందులో భాగంగా.. పిల్లులను పెంచుకుంటోంది. కొన్ని రోజుల నుంచి పిల్లుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.
ఎవరో కావాలనే తాను పెంచుకుంటున్న పిల్లులను చంపేస్తున్నారని, అంతేకాకుండా పిల్లుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఒంగోలులో ఆమె నిరసన చేపట్టారు. మూగజీవాల పట్ల నిర్దయగా వ్యవహరించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.