ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ సర్పంచ్​ ఇంటికి మహిళ నిప్పు.. దంపతులకు తీవ్ర గాయాలు - మాజీ సర్పంచ్​ ఇంట్లో పెట్రోల్​ పోసి నిప్పు

Nellore Crime News: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచ్, వైకాపా నేత వెంకట సుబ్బారెడ్డి ఇంటిపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో దంపతులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

మాజీ సర్పంచ్​ ఇంట్లో పెట్రోల్​ పోసి నిప్పు
మాజీ సర్పంచ్​ ఇంట్లో పెట్రోల్​ పోసి నిప్పు

By

Published : Apr 8, 2022, 10:53 PM IST

Nellore District News: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామ మాజీ సర్పంచ్, వైకాపా నేత వెంకట సుబ్బారెడ్డి ఇంటిపై పెట్రోల్ పోసి.. ఓ మహిళ నిప్పంటించింది. మంటలు ఎగిసిపడటంతో వెంకటసుబ్బారెడ్డి ఆయన భార్య సునీతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం వేళ సుబ్బారెడ్డి ఇంటి వద్దకు వచ్చిన ఓ మహిళ.. తలుపులు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైంది. ఆ సమయంలో వెంకటసుబ్బారెడ్డి దంపతులు ఇంట్లోనే ఉన్నారు.

ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఇంట్లో ఉన్న భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మంటలను గుర్తించిన స్థానికులు.. సుబ్బారావు దంపతులను రక్షించి చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. మంటల తీవ్రతకు ఇంట్లోని సామాగ్రితోపాటు బయట ఉన్న కారు దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గ్రామానికి చెందిన సుగుణ అనే మహిళకు.. వెంకటసుబ్బారెడ్డికి మధ్య ఉన్న విభేదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారెడ్డిని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

ఇదీ చదవండి:PUB RAID CASE : పుడింగ్ పబ్‌లోకి కొకైన్ ఎలా వచ్చింది? తీసుకొచ్చింది ఎవరు?

ABOUT THE AUTHOR

...view details