నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వరికుంటపాడు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో సిబ్బంది ఎవరూ లేకపోవడం, నొప్పులు తీవ్రమైన పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో అక్కడే ఉన్న బల్ల పై మహిళ ప్రసవించింది.
ఈ ఘటనతో బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురైంది. అత్యవసర సేవల కోసం వస్తే.. సిబ్బంది లేని కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.