పిల్లల కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంటే... వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కాలరాస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిలో ఓ బాలికతో గదులను శుభ్రం చేయించారు. స్పాట్ వాల్యుయేషన్కు వచ్చిన ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందికి గదిని కేటాయించారు. గది మొత్తం మురికిగా ఉండటంతో... ఎస్కార్ట్ పోలీసులు, కళాశాల సిబ్బంది దగ్గరుండి మరి కళాశాల వాచ్మెన్ కుమార్తెతో శుభ్రం చేయించారు. మూడోతరగతి చదివే బాలికతో... గదినంతా తుడిపించారు. పిల్లలను పనిచేయించవద్దని చేప్పే అధికారులే ఇలా చాకిరి చేయించడంతో పలువురు మండిపడుతున్నారు.
పాపతో పని చేయించడం... వారికి పాపమని అనిపించలే..!
ఆటలాడుతూ..పాటలు పాడుతూ ఉండాల్సిన చిన్నారితో చాకిరి చేయిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిలో ఈ బాలికతో గదులను శుభ్రం చేయిస్తున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది పర్యవేక్షణలో ఈ నిర్వాకం జరుగడం గమనార్హం.
ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ గదిని తుడిచిన బాలిక