మద్యం కోసం 40 రోజుల పాటు వేచి ఉన్న మద్యం ప్రియులు.. మందు కొనుగోళ్లకు ఉదయం నుంచే దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఎండను సైతం లెక్కచేయకుండా.. లైన్లో నిలబడి మరీ కొనుక్కుంటున్నారు.
ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు... సిబ్బందితో కలసి దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించి.. మద్యం విక్రయాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఉదయగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఐదు మండలాల్లో 13 మద్యం దుకాణాల్లో విక్రయాలు జరుగుతున్నాయి.