ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలతో కలిసి భర్త శవం వద్దే 3 రోజులు! - wife and childrens with dead body news athmakuru news

రెక్కల కష్టంతో పొట్ట నింపుకొనే కుటుంబం వారిది. ఇంటి పెద్ద హఠాత్తుగా మరణించాడు. ఆ గిరిజన కుటుంబం కుప్పకూలింది. ఆయన భార్యకు అంతకుముందే మతి స్థిమితం సరిగా లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

wife-three-days-with-husband-dead-body
wife-three-days-with-husband-dead-body

By

Published : Mar 2, 2020, 9:12 PM IST

Updated : Mar 2, 2020, 11:36 PM IST

పిల్లలతో కలిసి భర్త శవం వద్దే 3 రోజులు!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మోడల్ కాలనీలో యాకయ్య - నాగమణి దంపతులు, వారి ఇద్దరు పిల్లలు నివసించేవారు. నాగమణికి మతిస్థిమితం సరిగా ఉండేది కాదు. ఫలితంగా.. కుటుంబం మొత్తానికి యాకయ్యే ఆధారంగా ఉండేవాడు. రోజు కూలీ పని చేసుకునే యాకయ్య.. ఇటీవల చనిపోయాడు. మతి స్థిమితం సరిగా లేని నాగమణికి.. భర్త మరణించిన విషయం అర్థం కాలేదు. పిల్లలు కూడా ఆమెకు విషయాన్ని చెప్పలేకపోయారు. మూడు రోజులు అలా.. యాకయ్య శవం పక్కనే నాగమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చివరికి విషయాన్ని గుర్తించిన స్థానికులు.. ఐక్య ఫౌండేషన్​కు సమాచారం ఇచ్చారు. ఆ సంస్థ ప్రతినిధులు యాకయ్యకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఇల్లు కదల్లేని నాగమణి, ఆమె పరిస్థితి ఏంటన్నది.. ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Last Updated : Mar 2, 2020, 11:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details