నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. పెళ్లైన మూడు నెలలకే భర్త కువైట్కు వెళ్లగా... అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొరుటూరు గ్రామానికి చెందిన సైదానికి ఇందుకూరుపేటకు చెందిన హనీఫ్తో అయిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన మూడు నెలలకే ఉద్యోగం పేరుతో కువైట్కు వెళ్లిన భర్త, కొంత కాలం ఫోన్లో అందుబాటులో ఉన్నాడని... తర్వాత ముఖం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
భర్త రావాలంటే రూ.ఐదు లక్షలు తేవాలని అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయింది. ఇప్పుడు భర్తకు ఫోన్ చేస్తే తనకు కువైట్లో పెళ్లి అయిందని చెప్పడంతో దిక్కుతోచని ఆమె అత్తింటి ఎదుట బైఠాయించింది. పోలీసు స్టేషన్కు వెళ్లి తనకు న్యాయం చెయ్యాలంటూ ధర్నా నిర్వహించింది. గతంలోనూ ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.