నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి సమీపంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 21 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తన సిబ్బందితో కలిసి జరిపిన తనిఖీల్లో భాగంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆత్మకూరు ఎస్ఐ రవి నాయక్ పేర్కొన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు అదుపులోకి తీసుకున్న భార్యాభర్తలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. భార్యాభర్తలు అరెస్టు - atmakuru police latest news update
అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంతోపాటు.. ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు తెలిపారు.
అక్రమంగా రేషన్ బియ్యం తరలింపులో భార్యభర్తల అరెస్టు
ఇవీ చూడండి...