నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల ఉత్తర కాలువలో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. 14ఏళ్ల సుజిత్ ఈత కోసం వెళ్లగా.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు గాలింపు చర్యలు చేపట్టారు. కాలువకు కొద్ది దూరంలోనే బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
సోమశిల ఉత్తర కాలువలో గల్లంతైన బాలుడు మృతి - సోమశిల ఉత్తర కాలువలో గల్లంతైన బాలుడి ఆచూకీ లభ్యం వార్తలు
సరదాగా ఈత కోసం వెళ్లి గల్లంతైన బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగింది. సోమశిల ఉత్తర కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బాలుడు కొట్టుకుపోయాడు.

సోమశిల ఉత్తర కాలువలో గల్లంతైన బాలుడి ఆచూకీ లభ్యం