ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటాం: సోమిరెడ్డి

కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటామని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మీద విశ్వసనీయత కోల్పోయే పరిస్థితులు తేవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Apr 2, 2021, 10:38 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే ఆ ప్రక్రియలో పాల్గొంటామని... మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. లేనిపక్షంలో నిరసన తెలుపుతూ... ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. నెల్లూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం ముఖ్య సలహాదారుగా పనిచేసిన అధికారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని నమ్మకం లేదన్నారు. ఎన్నికల కమిషన్ మీద విశ్వసనీయత కోల్పోయే పరిస్థితులు తేవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

దిల్లీకి చెందిన నీలం సాహ్నీపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. సీఎస్​గా రిటైరైన వెంటనే తన సలహాదారుగా నియమించుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎస్​ఈసీగా నియామకం అయ్యేలా చేశారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు షెడ్యూల్ ప్రకటిస్తే ఆమె సంతకం చేసి ఆర్డర్ ఇస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో స్టేట్ ఎన్నికల కమిషన్ లేదని అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ... మా నాన్నది రాజకీయ హత్యే: సునీతారెడ్డి

ABOUT THE AUTHOR

...view details