సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి నీటి వృథా - Water Wastage from Sarvepalli Reservoir
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అనికేపల్లి వద్దనున్న సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి నీరు వృథాగా పోతోంది. వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ రిజర్వాయర్ నుంచి నక్కల కాలువకు నీటిని వృథాగా వదులుతున్నారు. ఈ నీరు నేరుగా సముద్రంలోకి వెళ్తోంది. ఇలా నీరు ఎందుకు వదులుతున్నారో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని, ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియటంలేదని రైతులు అంటున్నారు.