సోమశిల జలాశయం ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించామని ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారావు తెలిపారు. రబీ సీజన్లో నీటి కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నార్త్ ఫీడర్ కెనాల్ ద్వారా 50 చెరువులకు, కావలి కెనాల్ ద్వారా మరో 50 చెరువులకు నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
'కాలువల ద్వారా వంద చెరువులు నింపుతున్నాం' - సోమశిల జలాశయం నేటి వార్తలు
ఎగువ ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి వరద వస్తోంది. కాగా.. ప్రాజెక్టు కాలువల ద్వారా జిల్లాలో వంద చెరువులను నింపుతున్నామని ప్రాజెక్టు సూపరింటెండెంట్ కృష్ణారావు అన్నారు.
!['కాలువల ద్వారా వంద చెరువులు నింపుతున్నాం' water release from somashila resorvoir in nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8450837-305-8450837-1597664265574.jpg)
వివరాలు వెల్లడిస్తున్న సోమశిల జలాశయం సూపరింటెండెంట్