నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచి తెలుగు గంగా ఇన్ఛార్జి చీఫ్ ఇంజినీర్ హరి నారాయణరెడ్డి నీటిని విడుదల చేశారు. చెన్నై, చిత్తూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, రాపూరు ప్రజలకు తాగునీటి అవసరాల మేరకు 1700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 39 టీఎంసీల నీరు ఉందనీ.. సోమశిల జలాశయం నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు కండలేరు జలాశయానికి వస్తున్నట్లు వివరించారు. రబీ సీజన్లో కండలేరు నుంచి రైతులకు సమృద్ధిగా నీటిని అందిస్తామని అన్నారు.
కండలేరు జలాశయం నుంచి నీరు విడుదల - కండలేరు రిజర్వాయర్ న్యూస్
నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కండలేరు జలాశయం నుంచి నీరు విడుదల