ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి: కమిషనర్ రమేష్ బాబు - నెల్లూరులో నీటి సమస్య వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తాగునీటి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు.. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. వాటర్ ప్లాంట్ వద్ద గత నెలలో ఏర్పడిన కొద్దిపాటి సమస్య కారణంగా.. పట్టణ తాగునీటి సరఫరా పంపిణీ సమయాల్లో మార్పులు వస్తున్నాయని తెలిపారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

water plant
water plant

By

Published : May 19, 2021, 6:02 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని.. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటర్ ప్లాంట్ వద్ద గత నెలలో ఏర్పడిన కొద్దిపాటి సమస్య కారణంగా.. పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా పంపిణీ సమయాల్లో మార్పులు వస్తున్నాయని చెప్పారు.

ఆత్మకూరు టిడ్కో భవనాలకు నీటి అవసరాలు తీర్చే నిమిత్తం.. భవనాల ప్రాంతంలో ప్రత్యేక బోరును ఏర్పాటు చేయగా.. అక్కడ నీటి సమస్య తీరిపోయిందన్నారు. మరో రెండు రోజుల్లో వెంకట్రావుపల్లి ప్రాంతంలో ప్రత్యేక బోరు ఏర్పాటు చేసి అక్కడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో ప్రస్తుతం నీటి పంపిణీ వ్యవస్థలో ఉన్న మార్పులను వారం రోజుల్లో సరి చేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details