సోమశిల నుంచి కండలేరు జలాశయానికి చేస్తున్న నీటి విడుదలను అధికారులు తగ్గించారు. నెల రోజులుగా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు కండలేరు కాలువ ద్వారా ప్రవహించింది. ఇప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిన కారణంగా... నీటి విడుదలనూ అధికారులు తగ్గించారు. కండలేరు జలాశయానికి 5 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే అధికారులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 46 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.
సోమశిలకు తగ్గిన వరద.. పరిమితంగా నీటి విడుదల - కండలేరు జలాశయానికి నీటి విడుదల తగ్గింపు
ఎగువ ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి వరద తగ్గినట్టు అధికారులు తెలిపారు. ఈ కారణంగా కండలేరుకు 5 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నామన్నారు.

కండలేరు జలాశయానికి తగ్గించిన నీటి విడుదల
కండలేరు జలాశయానికి తగ్గించిన నీటి విడుదల
Last Updated : Nov 18, 2019, 4:48 PM IST