ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుడిని చితకబాదిన వార్డు వాలంటీర్...ఎందుకంటే..!

నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో తొమ్మిదేళ్ల బాలుడిపై వార్డు వాలంటీర్ దాడి చేశాడు. బాలుడిని కిడ్నాప్ చేసి ఊరి చివర చెట్టుకు కట్టేసి స్పృహ కోల్పేయే విధంగా చితకబాదారని తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.

Ward volunteer
నెల్లూరు జిల్లాలో దారుణం... 'బాలుడిని చితకబాదిన వార్డు వాలంటీర్'

By

Published : Jul 25, 2020, 11:15 PM IST

నెల్లూరు జిల్లాలో దారుణం... 'బాలుడిని చితకబాదిన వార్డు వాలంటీర్'

నెల్లూరు జిల్లా మెట్టులో ఓ బాలుడిని వార్డు వాలంటీర్ చితకబాదాడు. ఓ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా చూసినందుకే తనను విపరీతంగా కొట్టారని బాధితుడు తెలిపాడు. చూసింది ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. వాలంటీర్ శ్రీనుకు తోడుగా మరో ఇద్దరు వచ్చి తనపై దాడి చేశారని చెప్పాడు. న్యాయం కోసం చిట్టమూరు పోలీస్ స్టేషన్ కి వెళితే తమను రాజకీయ నాయకుల ఒత్తిడితో...ఎస్సై బెదిరించాడని బాధిత బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ముగ్గురిపై ఫిర్యాదు చేస్తే చేస్తే మళ్లీ ఆ ఫిర్యాదును ఒక వ్యక్తి పైనే తిరగరాయించారని తెలిపారు. కుమారుడిపై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని... తమకు న్యాయం జరిగేలా చూడాలని తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి-'చనిపోయి 3 రోజులైనా సమాచారమివ్వలేదు...డబ్బులు బారీగా దండుకున్నారు'

ABOUT THE AUTHOR

...view details