Walkers Association : నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అంటే రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో తెలియని వారు లేరని చెప్పాలి. ఈ స్టేడియానికి నిత్యం వాకింగ్ కు వచ్చే వారు వేలాది మంది ఉంటారు. వాకర్స్ తో, క్రీడాకారులతో నిత్యం కళకళలాడే ఈ స్టేడియం నిర్వాహణకు వాకర్స్ అసోసియేషన్ ను 1994లో ఏర్పాటు చేశారు. ఇందులో శాశ్వత సభ్యులు 1450మంది ఉన్నారు. నిర్వహణ కోసం మరో ఐదువేల మంది పనిచేస్తారు. పేద క్రీడాకారులను ప్రోత్సహించడం. వారికి పౌష్టికాహారం అందించడం. విద్యార్ధులకు ఫీజులు, పుస్తకాలు ఇవ్వడం వంటివి చేస్తారు. పాఠశాలలకు, కళాశాలలకు సెలవు రోజుల్లో, సమ్మర్ శిక్షణకు వచ్చే వందలాది మంది విద్యార్ధులకు ప్రతి రోజు వీరు పౌష్టికాహారం పంపిణీ చేస్తారు. గ్రౌండ్ లోనే స్టేజి మీద యువక్రీడాకారులకు ఏదో ఒక పండు, గుడ్డు, చిక్కీలు, పాలు అందిస్తారు. ప్రత్యేక సమయాల్లో పేద క్రీడాకారులకు భోజనం వసతి ఏర్పాటుచేస్తారు.
ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఎంతమంది విద్యార్ధులు మైదానానికి వచ్చినా ఆహారం అందిస్తున్నారు. 1500మందికి ప్రస్తుతం మైదానంలో పంపిణీ చేస్తున్నారు. వాకర్స్ అసోసియేషన్ లో ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు, రిటైర్ అయిన వారు వారి జీతం, పింఛన్ నుంచి అసోసియేషన్ కు నెలకు కొంత నగదు అందిస్తారు. వేసవి శిక్షణా శిభిరంలో 10లక్షల రూపాయలకు పైగా పౌష్టికాహారానికి ఖర్చు చేస్తారు. పేద విద్యార్ధులకు ఫీజులు ఆరోగ్యానికి నగదు కావాలంటే మైదానంలో రింగ్ లో నిలబడి సహాయంకోరితే ఎంత కావాలో అంత అందజేస్తారు.
మైదానంలో దుమ్ములేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లి క్రీడాకారులకు సహకారం అందిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలైన వాకర్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యాక్రమాలను నిర్వహిస్తామని ధీమాగా చెబుతున్నారు. బైట్ 3. తిరుపతినాయుడు గౌరవ అధ్యక్షుడు.