ETV Bharat / state
నెల్లూరు జిల్లాలో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలం
ఈవీఎంల మొరాయింపు, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో వీవీప్యాట్ స్లిప్పులు ఆరుబయట దొరకడం సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థికి వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీవో బృందం వీవీ ప్యాట్ స్లిప్పులను తగులబెట్టారు.
వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలం
By
Published : Apr 15, 2019, 6:00 PM IST
| Updated : Apr 15, 2019, 9:03 PM IST
నెల్లూరు జిల్లాలో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11 న జరిగిన సార్వత్రిక సమరంలో చోటు చేసుకున్న ఘర్షణలు, ఈవీంల మొరాయింపు, ఆందోళనలపై పెద్ద చర్చ జరుగుతుండగానే మరో వివాదానికి తెరలేచింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు కలకలం సృష్టించాయి. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వీవీ ప్యాట్ స్లిప్పులు బయటపడ్డాయి. పాఠశాలలోని ఓ విద్యార్థికి దొరికిన ఈ స్లిప్పులను ఈటీవీ భారత్ ప్రతినిధికిచ్చారు.
ఈటీవీ భారత్ అందించిన సమాచారంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈవీఎలు ర్యాండమైజేషన్ చేసినప్పటి స్లిప్పులు కావొచ్చని వివరణ ఇచ్చారు. నిబంధనలు మేరకు ర్యాండమైజేషన్ స్లిప్పులనూ భద్రపరచాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
కలెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న ఆర్డీవో బృందం ఆత్మకూరు పాఠశాలకు చేరుకుంది. పలు కవర్లలో ఉన్న వీవీ ప్యాట్ స్లిప్పులు ఆర్డీవో బృందానికి దొరికాయి. ఘటనకు సంబంధించి స్థానికాధికారుల వివరణ కోరుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల సంఘం తీరుపై జాతీయస్థాయిలో పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు... ఈ స్లిప్పుల వ్యవహారంపైనా అనుమానాలు లేవనెత్తుతున్నారు. Last Updated : Apr 15, 2019, 9:03 PM IST