సేవా నిరతిని చాటుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు - Voluntary organizations that promote service delivery
కరోనా నేపథ్యంలో ఆహారం కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు తామున్నామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి నెల్లూరు నగరానికి వచ్చి చిక్కుకుపోయిన వారితో పాటు యాచకులకు ఆహార పొట్లాలు, మంచినీరు అందిస్తూ తమ సేవా నిరతిని చాటుకుంటున్నాయి.
నెల్లూరు నగరంలో లాక్డౌన్ ప్రకటించినప్పటినుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి స్వచ్చంద సంస్థలు తమ వంతు సాయం అందజేస్తున్నాయి. శివాజీ యూత్ ఫౌండేషన్ ప్రతి రోజు దాదాపు రెండు వందల మందికి ఆహార పోట్లాలు, మంచి నీళ్లు అందిస్తోంది. ఫౌండేషన్ సభ్యులు దేవాలయాలు, రోడ్ల పక్కన ఉండే యాచకుల వద్దకు వెళ్లి వారి ఆకలి తీరుస్తున్నారు. రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అయ్యప్ప గుడి నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు తిరుగుతూ నిర్బాగ్యులకు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. నగరంలోని జై చంద్ర నర్సింగ్ హోమ్ వైద్యుడు శైలేష్ మోటార్ సైకిల్‌పై తిరుగుతూ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందిర డెవలపర్స్ నిర్వాహకులు నగరంలో పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. వీరితోపాటు పలువురు యువకులు. మజ్జిగ, తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: 'కరోనా కన్నా ఆకలి ఎక్కువ భయపెడుతోంది'
TAGGED:
Karona Cheyutha