ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాలంటీర్ల అత్యుత్సాహం… పెట్టింది రెండు గ్రామాల మధ్య చిచ్చు - రెండు ఊర్ల మధ్య వాలంటీర్ల గొడవ

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామ వాలంటీర్ల ప్రవర్తన రెండు గ్రామాల మధ్య గొడవపెట్టింది. మహిమలూరు గ్రామంలోకి రావద్దంటూ వాలంటీర్లు అడ్డుకట్ట వేశారు. దెపూరు గ్రామస్థులను పొలం పనులకు వెళ్లనివ్వ లేదు. దీనిపై ఆగ్రహించిన దెపూరు గ్రామస్థులు వారి గ్రామంలోకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

voluntaries built boundry at nellore
వాలంటీర్ల అత్యుత్సాహం… పెట్టింది రెండు గ్రామాల మధ్య చిచ్చు

By

Published : Apr 30, 2020, 11:06 AM IST

Updated : Apr 30, 2020, 12:31 PM IST

గ్రామాల మధ్య రాకపోకలు లేకుండా అడ్డుకట్ట వేసిన గ్రామస్థులు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామ వాలంటీర్ల అత్యుత్సాహం రెండు గ్రామాల మధ్య వివాదానికి దారి తీసింది. మహిమలూరు గ్రామం వాలంటీర్లు నిన్న తమ గ్రామం మీదుగా వెళ్లడానికి లేదంటూ ముళ్ల కంచె అడ్డు వేశారు. పొలాల్లోకి సొంత పనులకు వెళ్లనీయకుండా దెపూరు గ్రామం వారిని అడ్డుకున్నారు. దెపూరు గ్రామస్థులు ఎంత చెప్పినా.. వాలంటీర్లు వినకపోవడం వల్ల చేసేదేమీ లేక వెనక్కు తిరిగారు. దీనిపై ఆగ్రహించిన దెపూరు గ్రామస్థులు దెపూరు వద్ద బారికేడ్లు పెట్టి మహిమలూరు గ్రామస్థులు రాకుండా అడ్డుకున్నారు. దీనివల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా గ్రామాల ప్రజలు మహిమలూరు మీదుగా వెళ్తుంటారు కానీ… మహిమలూరు వాలంటీర్లు ఇలా అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు గ్రామాల ప్రజలకు సర్దిచెప్పారు.

Last Updated : Apr 30, 2020, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details