ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంట నష్టపోయిన ప్రతిరైతు పేరును నమోదు చేయండి' - Damaged crop details in Nellore

నెల్లూరు జిల్లా రూరల్ మండలంలోని పొట్టేపాలెంలో వ్యవసాయ అధికారులు పర్యటించారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతిరైతు పేరును నమోదు చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు స్పష్టం చేశారు.

నష్టపోయిన ప్రతిరైతు పేరు
నష్టపోయిన ప్రతిరైతు పేరు

By

Published : Dec 8, 2020, 9:33 PM IST

నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాలెంలో ఉద్యాన సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ అరటి, కూరగాయ, వరి పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకోవాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచించారు. ఈ నెల 15లోపు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details