ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడిన విశ్వేశ్వర స్వామి ఆలయం - కార్తిక మాసం 2020

ఆత్మకూరు పట్టణంలో కార్తిక మాసం మూడో సోమావారం, కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్త జనం బారులు తీరారు. ఆలయం శివనామస్మరణతో మార్మోగింది.

karthika celebrations
భక్తులతో కిటకిటలాడిన విశ్వేశ్వర స్వామి ఆలయం

By

Published : Nov 30, 2020, 1:21 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందడి నెలకొంది. మహిళలు దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన అర్చకులు మేళ్ల చెరువు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని... తీర్థప్రసాదాలు స్వీకరించారు. శివాలయాలన్నీ భక్త జనంతో కిటకిటలాడాయి.

ABOUT THE AUTHOR

...view details