ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఏఏకి అక్కడ మద్దతు... ఇక్కడ వ్యతిరేకత..! - సీఏఏకి వ్యతిరేకంగా నెల్లూరులో ర్యాలీ

విశాఖ జిల్లా అనకాపల్లిలో సీఏఏపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. భాజపా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు కలెక్టర్​ కార్యాలయం ఎదుట సీఏఏకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కులమతాల మధ్య విభేదాలు సృష్టించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు.

visakha anakapalli people suppotr to caa bill and nellore people oppose to caa bill
సీఏఏకి ఓ పక్క మద్దతు... మరో పక్క వ్యతిరేకత..!?

By

Published : Jan 2, 2020, 9:20 PM IST

సీఏఏకి మద్దతుగా అనకాపల్లిలో ప్రదర్శన ర్యాలీ

సీఏఏకి మద్దతుగా...
సీఏఏ బిల్లుకు మద్దతుగా విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు, వివిధ ప్రజాసంఘాలు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భాజపా నేతలు మాధవ్, మాజీఎంపీ హరిబాబు, మాజీఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు సీఏఏపై ప్రసంగించారు.

సీఏఏకి వ్యతిరేకంగా నెల్లూరులో నిరాహార దీక్ష

సీఏఏకి వ్యతిరేకంగా...
సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ... నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ పార్టీల మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. కులమతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. మైనారిటీలను అభద్రతా భావానికి గురిచేసే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'మానసికంగా వేధిస్తున్నారు.. కాపాడండి'

ABOUT THE AUTHOR

...view details