ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషజ్వరాలతో అల్లాడిపోతోన్న జనం - Mosquitoes problems in guntur and anantapur districts.

అధికారుల అలసత్వం..ప్రజల్లో అవగాహనారాహిత్యం..వాతావరణంలో మార్పు..వెరసి రాష్ట్రంలో విషజ్వరాలు ప్రజ్వరిల్లుతున్నాయి. జిల్లా, ప్రాంతం తేడా లేకుండా ప్రజలు జ్వరాల బారిన పడి అల్లాడిపోతున్నారు. లక్షల రూపాయాలను ఖర్చు చేసుకుంటూ,ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికార్లు స్పందించి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

విష జ్వరాల విజృంభణ... ప్రజల్లో పెరుగుతోంది ఆందోళన...

By

Published : Oct 11, 2019, 7:23 PM IST

విష జ్వరాల విజృంభణ... ప్రజల్లో పెరుగుతోంది ఆందోళన...

రాష్ట్రంలో ఎక్కడి చూసినా విషజ్వరాలు విలయతాండవం చేస్తున్నాయి..పారిశుద్ద్యలోపం ప్రజలను భయంకరమైన రోగాలభారిన పడేస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లాలో
పశ్చిమగోదావరి జిల్లా మెట్ట మండలాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.గ్రామాల్లో పారిశుధ్యం లోపించి నివాసల మధ్య నీరు నిలిచి వాటి నుంచి వచ్చిన దోమలు కుట్టి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.తమ సమస్యను అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.


అనంతపురం జిల్లాలో

అనంతపురం జిల్లా కదిరిలో లక్షకుపైన జనాభా ఉన్నా...ఆ స్థాయిలోనే మురికివాడలు ఉన్నాయి.పట్టణంలోని కుటాగుళ్ల,అడపాల వీధి,నిజాంవలి కాలనీ,మశానం పేట ప్రాంతాల్లో జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంది.ప్రభుత్వ వైద్యశాల చికిత్స అందక ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి భారీగా సమర్పించుకున్నారు ప్రజలు.పారిశుద్ధ్య సిబ్బంది సరిగా రావటంలేదని ఫిర్యాదు చేస్తున్నారు స్థానికులు.


కృష్ణా జిల్లాలో

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు పంచాయతీలో తాగునీరు కలుషితమై రోగాల భారిన పడుతున్నామంటున్నారు ప్రజలు.వెంటనే అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు గ్రామస్థులు.


నెల్లురు జిల్లాలో


నెల్లూరులోని కాలనీల్లో కాలువలు లేక మురుగునీరు నిలిచిపోతోంది.దోమలు విపరీతంగా వృద్ధి చెంది ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు.వచ్చిన సంపాదనలో సగం మందులకే పోతుందని వాపోతున్నారు జనం.


గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో విషజ్వరాలు వ్యాపించాయి.ఇప్పటికే పది మంది వరకు మృత్యువాత పడ్డారు.వెంటనే అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు.


కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రభుత్వ పాఠశాలలో పందులు స్వైర విహారం విద్యార్థులను భయపెడుతోంది.అపరిశుభ్ర వాతావరణంలో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు తల్లిదండ్రులు.వీటి ప్రభావంతో బడి మానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు ఉపాధ్యాయులు.


రాష్ట్రమంతటా విషజ్వారాలు ఇంతలా విజృంభిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శుల వినిపిస్తున్నాయి.ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి...పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి

ముక్కు మూసుకుంటేనే చదువు సాగేది...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details