నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయక చవితిని ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని ఆత్మకూరు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో వేడుకలను నిర్వహించొద్దంటూ సీఐ వైవీ సోమయ్య ప్రజలకు తెలిపారు. నిబంధనలను అతిక్రమించి వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
'వినాయక చవితిని ఎవరి ఇంట్లో వారే నిర్వహించుకోవాలి' - ఆత్మకూరులో వినాయక చవితి ఆంక్షలు
వినాయక చవితిని ఎవరి ఇంట్లో వారే నిర్వహించుకోవాలని నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో సీఐ. సోమయ్య ప్రజలకు తెలిపారు.
!['వినాయక చవితిని ఎవరి ఇంట్లో వారే నిర్వహించుకోవాలి' Vinayaka Chaviti Sanctions at atmakuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8435577-375-8435577-1597515553490.jpg)
సీఐ. సోమయ్య