గ్రామ ప్రజలంతా చందాలేసుకుని శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేసుకున్నామని.. ఓ వ్యక్తి శ్మశాన వాటికను కబ్జా చేశాడని నెల్లూరు జిల్లా పుట్టుపల్లి గ్రామస్థులు ఆరోపించారు. అడిగితే భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరిస్తున్నాడని ఆ గ్రామ సర్పంచ్ పురుషోత్తం చెప్పారు. ఈ సమస్యను ఆత్మకూరు ఆర్డీవో చైత్ర వర్షణి దృష్టికి తీసుకెళ్లామని.. ఆమె పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిపారు.
శ్మశాన వాటికను కబ్జాదారు నుంచి రక్షించాలని గ్రామస్థుల వినతి - పుట్టపల్లిలో శ్మశాన వాటిక కబ్జా వార్తలు
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పుట్టుపల్లిలో శ్మశాన వాటికను ఓ వ్యక్తి కబ్జా చేశాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు ఆర్డీవోకు ఈ విషయమై ఫిర్యాదు చేశామన్నారు.
occupied