వాలంటీర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆందోళన - kottapatnam new volunteers recruitment latest news
గ్రామ వాలంటరీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ... నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంతవరకు గ్రామ సచివాలయం తెరిచేది లేదంటూ సిబ్బందిని బయటకి పంపి సచివాలయాన్ని మూసివేశారు.

నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలో వాలంటీర్ల నియామకంలో ఎంపీడీవో అవకతవకలకు పాల్పడ్డారంటూ గ్రామ సచివాలయం వద్ద స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో బీసీ మహిళలకు కేటాయించిన వాలంటీర్ పోస్టును ఎంపీడీవో ప్రలోభాలకు లోబడి ఎస్సీ మహిళకు కేటాయించారని ఆందోళన చేపట్టారు. ఈమేరకు వాలంటీర్ నియామకాల్లో న్యాయం జరిగే వరకు గ్రామ సచివాలయం మూసివేస్తామంటూ కోట మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు ప్రసాద్ గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం సచివాలయంలోని సిబ్బందిని బయటకు పంపి తలుపులు మూసివేశారు. చేసేది లేక సచివాలయ సిబ్బంది చెట్టు కిందనే విధులు నిర్వహిస్తున్నారు.