villagers concern in nellore district: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో అధికారుల తీరును నిరసిస్తూ స్థానిక సర్పంచి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. స్థానిక వైకాపా నాయకుల మాటలు విని.. అర్హులు కానీ వారికి వరద సహాయ నిధి, సరుకుల పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. అన్ని చోట్ల పంపిణీ చేసి అర్హులైన సోమశిల ఎస్సీ కాలనీ, కమ్మవారి పల్లెలో మాత్రం పంపిణీ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని... అందరికీ పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించినప్పటీ అధికారుల తీరు మారటం లేదని వాపోయారు.
villagers concern in nellore district: మంత్రి చెప్పినా.. అధికారులు తీరు మారటం లేదు - నెల్లూరు జిల్లా తాజా సమాచారం
వరద సహాయ నిధి పంపిణీలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నెల్లూరు జిల్లాలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. స్థానిక వైకాపా నాయకుల మాటలు విని అర్హులైన తమకు వరద సహాయ నిధి పంపిణీ చేయటం లేదని వాపోయారు. మంత్రి చెప్పినా అధికారులు తీరు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
villagers concern