ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కోవిడ్ వైరస్‌పై అవగాహన కల్పించేందుకు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నడుం బిగించారు. జిల్లాలోని పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజలకు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి 4నెలలుగా నిరంతరం అన్నార్తుల ఆకలి తీర్చడమే కాకుండా వారికి కరోనా నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లు అంటించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని శివారు కాలనీల్లో పేద ప్రజలు కోసం... దాతల సాయంతో నిత్యావసర వస్తువులను అందించి ఆదుకుంటున్నారు.
కరోనా ఉద్యమంలో.. సైనికుల్లా మారిన విద్యార్థులు - నెల్లూరు సింహపురి విశ్వవిద్యాలయంపై వార్తలు
కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో విద్యార్థులు భాగమవుతున్నారు. నెల్లూరు జిల్లా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కరోనా విజృంభిస్తున్న సమయంలో.. తమకు తోచిన సాయం చేసి అన్నార్తులను ఆదుకుంటున్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా ఉద్యమంలో.. సైనికుల్లా మారిన విద్యార్థులు