వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వేణుంబాకలోని తాళ్ళపూడి గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయన.. గతంలో అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. ఇప్పుడు. వాటితో జరిగిన పనులను పరిశీలించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి వారితోపాటు ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు గ్రామంలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
దత్తత గ్రామంలో విజయసాయి పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన - vijaysai reddy latest news update
వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దత్తత గ్రామం తాళ్లపూడిలో పర్యటించారు. అభివృద్ధి పనుల తీరును పరిశీలించారు.
దత్తత గ్రామంలో పర్యటించిన విజయసాయి రెడ్డి