నెల్లూరు జిల్లాలో అక్రమ వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని స్టోన్ హౌస్ పేట పరిధిలో పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రైతు బజార్, కూరగాయల మార్కెట్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు తూకాల్లో తేడాలున్న కాటాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పప్పు దినుసుల దుకాణల్లో సోదాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు.
అక్రమ వ్యాపారాలపై విజిలెన్స్ అధికారుల దాడి - nelloor dist
అక్రమ వ్యాపారులపై నెల్లూరులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు బజార్, కూరగాయల మార్కెట్లలో తనిఖీలు చేపట్టి..తూకాల్లో తేడాలున్న కాటాలను స్వాధీనం చేసుకున్నారు.
![అక్రమ వ్యాపారాలపై విజిలెన్స్ అధికారుల దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4511441-616-4511441-1569072703471.jpg)
అక్రమ వ్యాపారులపై..విజిలెన్స్ అధికారుల తనిఖీ