నెల్లూరు నగరంలోని గుడిపల్లి వద్దనున్న ఆంజనేయ రాగుల మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రాగులను అధికారులు మిల్లులో గుర్తించారు. 39 బస్తాల పీడీఎస్ రాగులతోపాటు లెక్కల్లో చూపకుండా అనధికారికంగా నిల్వ చేసిన 11 లక్షల విలువైన రాగులను సీజ్ చేశారు. రేషన్ షాప్ల నుంచి మిల్లులకు రాగులు అక్రమంగా రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
నెల్లూరులో విజిలెన్స్ దాడులు...11 లక్షల విలువైన రాగులు సీజ్ ! - నెల్లూరులో విజిలెన్స్ దాడులు...11 లక్షల విలువైన రాగులు సీజ్ !
నెల్లూరు జిల్లాలోని ఓ మిల్లులో అక్రమంగా నిల్వఉంచిన రాగులను విజిలెన్స్ అధికారులు పట్టకున్నారు. 11 లక్షల విలువైన రాగులను స్వాధీనం చేసుకొని మిల్లును సీజ్ చేశారు.
నెల్లూరులో విజిలెన్స్ దాడులు