నెల్లూరు జిల్లా (nellore district) వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవం(20th anniversary of Swarnabharat Trust )లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. తెలుగు భాష రక్షణ కోసం స్వర్ణభారత్ ట్రస్టు ప్రయత్నిస్తోందన్నారు. మాతృభాష, మాతృభూమిని ఎప్పటికీ మరచిపోవద్దని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వెంకయ్య.. సేవే అసలైన మతమని తాను ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు.
సేవా సంస్థలను ప్రోత్సహిస్తారనే అనేక మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాను. సొంత ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతాను. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో... సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యం వస్తుంది. ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్ కార్యక్రమాల్లో పాల్గొంటాను. వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి