కృష్ణపట్నం, తుమకూరు నోడ్లకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించటం ఆనందదాయకమని... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం లభిస్తోందన్నారు. దీని వల్ల దాదాపు 1.90 లక్షల ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాలో కృష్ణపట్నం నోడ్ .. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 భాగమని వెంకయ్యనాయుడు అన్నారు.
నోడ్లకు కేంద్రం ఆమోదం.. ఆనందదాయకం: ఉపరాష్ట్రపతి - వెంకయ్యనాయుడు న్యూస్
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. కృష్ణపట్నం, తుమకూరు నోడ్లకు ఆమోదం తెలపటం పట్ల, ఉపరాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. ఇది లక్షల ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చే అవకాశం ఉందన్నారు.
ఉపరాష్ట్రపతి