ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మానవతను చాటారు. తన కుమార్తె శస్త్రచికిత్సకు సాయం అందించాలన్న ఓ తండ్రి లేఖకు స్పందించారు. సొంత నిధులతో సహా రూ.18 లక్షల మేర సేకరించి.. బాధిత కుటుంబానికి అందజేశారు. నెల్లూరుకు చెందిన చెంచుకుమార్ సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె దివ్యశ్రీ ఎంసీఏ పూర్తిచేశారు. ఆమె కొన్నాళ్లుగా ఫాంకొనీ అనిమియాతో బాధపడుతున్నారు. బోన్‌మ్యారో మార్పిడి శస్త్రచికిత్స చేయాలని... అందుకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అంత భరించలేక.. బాధితురాలి తండ్రి ఉపరాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు.
యువతి శస్త్రచికిత్సకు ఉపరాష్ట్రపతి సాయం - నెల్లూరులో యువతికి ఉపరాష్ట్రపతి సాయం వార్తలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అనారోగ్యంపాలైన ఓ యువతికి సాయం చేశారు. ఆమె శస్త్రచికిత్సకోసం రూ. 18 లక్షలు జమచేసి బాధితురాలి కుటుంబానికి అందజేశారు.
ఉప రాష్ట్రపతి స్పందించి యువతి వైద్యానికి తమ వంతుగా ఆయన సతీమణి ఉషమ్మ ద్వారా రూ.లక్ష, ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి రూ.75 వేలు వెంటనే విడుదల చేయించారు. ప్రధానమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3 లక్షలు విడుదలయ్యేలా చొరవ తీసుకున్నారు. స్వర్ణభారత్ ట్రస్టు తరఫున మరో రూ.లక్ష, కుమారుడు హర్షవర్థన్, కుమార్తె దీపా వెంకట్ వ్యక్తిగతంగా చెరో రూ.లక్ష చొప్పున సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తన మిత్రులు బి.సుబ్బారెడ్డి (వంశీరామ్ బిల్డర్స్) రూ.5 లక్షలు, రవిరెడ్డి సన్నారెడ్డి (శ్రీసిటీ) రూ.2.25 లక్షలు, సి.వెంకటేశ్వరరెడ్డి (అపర్ణ కన్‌స్ట్రక్షన్స్) రూ.2 లక్షలు, సి.సుబ్బారెడ్డి (సీ బ్రోస్ కన్‌స్ట్రక్షన్స్) రూ.లక్ష సేకరించారు. మొత్తమ్మీద రూ.18 లక్షలు ఆ కుటుంబానికి అందేలా చూశారు.
ఇదీచూడండి.ఏలూరు ఘటన కారణాల అన్వేషణకు నమూనాలు సేకరణ
TAGGED:
Vice President assists