అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రజలందరిని భాగస్వామ్యం చేసేలా వారి నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలింద్ జి పరండే తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ప్రారంభమైన విరాళాల సేకరణ.. వచ్చే నెల 20 వరకు కొనసాగుతుందని నెల్లూరులో ఆయన వెల్లడించారు. నగరంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చిన పరండే ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
'ప్రజల భాగస్వామ్యం కోసమే.. విరాళాల సేకరణ' - విరాళాల సేకరణ తాజా వార్తలు
చరిత్రలో నిలిచిపోయేలా రామమందిర నిర్మాణం చేపడుతున్నట్లు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలింద్ జి పరండే తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఈ నెల 15 నుంచి ప్రారంభమైన విరాళాల సేకరణ.. వచ్చే నెల 20 వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పరండే విమర్శించారు.
విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలింద్ జి పరండే
రాష్ట్రంలోని దాదాపు కోటి కుటుంబాల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించనున్నట్లు ఆయన చెప్పారు. చరిత్రలో నిలిచిపోయేలా రామమందిర నిర్మాణం జరగుతుందన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని ఆయన తెలిపారు. దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పరండే విమర్శించారు. తిరుమలలో.. అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఖర్చు ఎంతంటే?