Veteran Players: నెల్లూరుకు చెందిన కొందరు వెటరన్ క్రీడాకారులు.. 2010లో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం ప్రతిరోజు మైదానంలో పరిగెత్తడం, నచ్చిన క్రీడల్లో పాల్గొనటం. నేటికీ వీరందరూ కలిసి ఇతర రాష్ట్రాల్లో జరిగే పోటీలకు వెళ్తున్నారు. అసోసియేషన్లో 100 మంది వరకు సభ్యులు ఉన్నారు. మైదానంలో వీరిని చూస్తే అరవైల్లోనూ ఇరవైలా సందడి చేస్తున్నారు. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పరిగెత్తడం, జావెలిన్ త్రో, వ్యాయామం వంటివి చేస్తున్నారు. సింగపూర్, జకార్తా, పూణేలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.
వీరంతా ఇంట్లో పనులకు పరిమితం కాకుండా మైదానంలోనూ గడుపుతున్నారు. నేటి విద్యార్ధులు కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అందుకు తగు విధంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఆరోగ్యంగా జీవించాలని, నూతనోత్సాహంతో ముందుకు సాగాలని కోరుతున్నారు.
నేటి యువత చదువు, ఉద్యోగాల ఒత్తిడిలో పడి క్రీడలకు దూరమవుతున్నారు. అలాంటి వారందరికీ ఈ వెటరన్ క్రీడాకారులు ఆదర్శంగా నిలుస్తున్నారు.