నెల్లూరు మూలపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి కోసం... దేవస్థానం భూముల అమ్మాలని ప్రతిపాదనలు పంపామని ఆలయ ఛైర్మన్ మన్నెం లక్ష్మీనాథ్ రెడ్డి తెలిపారు. మూడు కోట్ల రూపాయల ఆలయ బకాయిల కోసం... వందల కోట్ల విలువైన ఆస్తులు అమ్ముతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. 139 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని, ఆలయ పునర్నిర్మాణంతో పాటు వివాహ మండపాలు, అర్చకుల వసతి భవనాల నిర్మాణాలకు దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ఆయన అంచనా వేశారు. ఆలయానికి సంబంధించి 13 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, వీటి ద్వారా వచ్చే నగదుతోనే ఆలయ నిర్వహణ జరుగుతోందన్నారు.
'భూముల విక్రయంపై వస్తున్న వార్తాల్లో నిజం లేదు' - వేణుగోపాలస్వామి భూములు అమ్మివేత వార్తలు
నెల్లూరులోని ప్రసిద్ధి శ్రీవేణుగోపాల స్వామి ఆలయ భూముల విక్రయంపై వస్తున్న వార్తల గురించి... దేవస్థానం ఛైర్మన్ లక్ష్మీనాథ్ రెడ్డి స్పందించారు. 3కోట్ల రూపాయల బకాయిల కోసం వందల కోట్ల విలువైన ఆస్తులు అమ్ముతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు.

Breaking News
ఇదీ చదవండి : వేణుగోపాలుడి ఆలయ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం..!