నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. శనివారం వెంకటగిరి పట్టణంలో ఆయన పర్యటించారు. వెంకటగిరి సమీపంలోని బంగారుపల్లి గ్రామంలో తడిచిన మగ్గాలను పరిశీలించి, చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కోరారు. మార్గమధ్యంలో బాలాయపల్లి మండలం వెంగమాంబపురం సమీపంలో ఆయన ఆగారు. రోడ్డు కల్వర్టు గోడపై కూర్చుని స్థానికులతో ముచ్చటించారు.
వెంకటగిరి చీరలకు అంతర్జాతీయ గుర్తింపు రావాలి: పవన్ - pawan tour in venkatagiri city news
నివర్ తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని బంగారుపల్లి గ్రామంలో తడిచిన మగ్గాలను పరిశీలించిన ఆయన... చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
pawan kalyan