నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతోపాటు 25 మంది తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడిలో భాగంగా తెదేపా నేతలు అమరావతికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో అరెస్టు చేసినట్లు వెంకటగిరి ఎస్ఐ వెంకట రాజేష్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు తెదేపా నాయకులు పోలీస్ స్టేషన్లోనే అల్పాహారం చేశారు.
పోలీసుల ముందస్తు అరెస్టులు.. స్టేషన్లోనే అల్పాహారం
అసెంబ్లీ ముట్టడిలో భాగంగా అమరావతికి బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు తెదేపా నాయకులు పోలీస్ స్టేషన్లోనే అల్పాహారం చేశారు.
వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నిరసన