నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మండలి, దేవాదాయ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు రాష్ట్రం నుంచేకాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదురోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఆదివారం నిలుపుతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం రథోత్సవం, మంగళవారం రథోత్సవం, బుధవారం అమ్మవారికి పసుపు, కుంకుమ ఉత్సవం, కల్యాణోత్సవం, రాత్రికి ప్రధానోత్సవం నిర్వహిస్తారు. గురువారం అమ్మవారికి పొంగళ్లు, రాష్ట్రస్థాయి ఎడ్ల జతల బండలాగుడు ప్రదర్శన పోటీలు చేస్తారు.
వెంగమాంబ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి - nellore
నెల్లూరు జిల్లా నర్రవాడలో కొలువైన శ్రీవెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలకు ఆలయ కమిటీ, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాలు